ప్రముఖ కొరియన్ నటి కాంగ్ సూ-యియోన్ (55) కన్నుమూశారు. దక్షిణ సియోల్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండె పోటుతో తుదిశ్వాస విడిచారు. కాంగ్ సూ కొన్నిరోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య నిమిత్తం కుటుంబ సభ్యులు ఆమెను రెండు రోజుల క్రితమే దకిణ సియోల్ లోని ఆస్పత్రికి తరలించారు.
ఆ ఆస్పత్రిలోనే మెరుగైన చికిత్సను అందిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు వైద్యులు అత్యవరస విభాగంలో ఉంచి మెరుగైన చికిత్సను అందిస్తుండగా సెరిబ్రల్ హెమరేజ్ కారణంతో ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల సినీ పెద్దలు సంతాపం తెలుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa