సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా మే 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా టికెట్ల రేట్ల పెంపునకు అనుమతినిస్తూ ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఉత్తర్వులు విడుదల చేశాయి. తాజాగా ఈ సినిమా యూనిట్‌కు తెలంగాణ సర్కారు మరో గుడ్ న్యూస్ అందించింది. సినిమా విడుదలయ్యే మే 12న ఆరు షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతులు అందించింది. అయితే హైదరాబాద్‌లోని నాలుగు థియేటర్లకు మాత్రమే ఈ అనుమతి ఉంది. మూసాపేటలోని శ్రీరాములు థియేటర్, కూకట్‌పల్లిలోని మల్లిఖార్జున, భ్రమరాంబ, విశ్వనాథ్ థియేటర్లలో ఉదయం 4 గంటలకు స్పెషల్ షో వేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. అయితే రాష్ట్రంలో మరెక్కడైనా ఆరవ షో వేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది.
ఇప్పటికే మే 12 నుంచి మే 18 వరకు ఈ సినిమా 5 షోలు వేసుకునేందుకు తెలంగాణ సర్కారు ఉత్తర్వులు అందజేసింది. అంతేకాకుండా టికెట్ల రేట్ల పెంపునకు అనుమతులు ఇచ్చింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ జోడీగా నటించింది. ఎస్ఎస్ థమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం పలువురిని ఆకట్టుకుంటోంది. : మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa