ప్రముఖ నటి నయన తార తమిళ భాషలో నటిస్తున్న తాజా చిత్రం ‘కొలమావు కోకిల’ (కోకో). నెల్సన్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో నయన్ డ్రగ్స్ అమ్మే యువతి పాత్రలో నటిస్తుంది. ఇక ఈ చిత్రం మొదట ఆగష్టు 10 న విడుదలవ్వాల్సి ఉండగా అదే రోజు కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’కూడా విడుదల కానున్నడంతో కోకో ని వాయిదా వేశారు. ఇక ఆగష్టు 17న ఈ సినిమా ప్రేక్షకులముందుకు రానుంది.ఇటీవల విడుదలైన ఈ చిత్ర వీడియో సాంగ్ రికార్డు వ్యూస్ ను సొంతం చేసుకుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa