యంగ్ హీరో నితిన్, బ్యూటీ క్వీన్ రాశీ ఖన్నా జంటగా నటించిన మూవీ శ్రీనివాస కళ్యాణం..దిల్ రాజు నిర్మాతగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన మూవీ ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ అందించాడు.
ఈ సినిమాలో కొన్ని పాత్రలను పరిచయం చేసే సందర్భాల్లోనూ .. కీలకమైన సన్నివేశాలను లింక్ చేసే సందర్భాల్లోను వాయిస్ ఓవర్ వుంటుందట. ఆ వాయిస్ ఓవర్ వెంకటే ష్ తో చెప్పిస్తే మరింత బాగా కనెక్ట్ అవుతుందని భావించి చిత్ర యూనిట్ ఆయనను సంప్రదించారు.
అందుకు అంగీకరించిన వెంకటేష్ ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమాలో అక్కడక్కడా వచ్చే ఆయన వాయిస్ ఓవర్ అదనపు ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa