మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్, మెగాఫోన్ పట్టి చేసిన మొదటి చిత్రం లూసిఫర్. ఇందులో మోహన్ లాల్ ప్రధాన పాత్రను పోషించారు. 2019లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. "గాడ్ ఫాదర్" పేరుతో ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. తెలుగులో ఈ మూవీని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ గాంధీ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో నయనతార, సత్యదేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఒక కీలకపాత్రను పోషించబోతున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా, కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ హిందీ వెర్షన్ కు సంబంధించిన డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ భారీ ధర పలికాయని టాక్. 42-45 కోట్ల ఒప్పందంతో ఒక ప్రముఖ ఓటిటి హిందీ గాడ్ ఫాదర్ రైట్స్ ను చేజిక్కించుకుందని సమాచారం. ఈ న్యూస్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa