టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి టెంపరరీగా 'SSMB28' అని టైటిల్ పెట్టారు. మహేష్ సరసన పూజా హెడ్గే నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం, మహేష్ బాబు ఈ సినిమా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయమని ముఖ్యంగా సెకండాఫ్‌లో మార్పులు చేయమని త్రివిక్రమ్‌ని కోరినట్లు సామాచారం. ప్రస్తుతం మహేష్ యూరప్ ట్రిప్‌లో ఉన్నందున, ఈ నెలాఖరున ఆయన రాగానే షూటింగ్ ప్రారంభం కానుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa