ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరంజీవి 'భోళా శంకర్' గురించిన మెగా అప్‌డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 21, 2022, 01:31 PM

మెహర్ రమేష్ దర్శకత్వంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి "భోళా శంకర్" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ హై బడ్జెట్ మూవీలో చిరంజీవి శంకర్ అనే క్యారెక్టర్‌ని పోషిస్తున్నారు అని లేటెస్ట్ టాక్. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కథానాయికగా నటిస్తోంది. రావు రమేష్, మురళీ శర్మ, తులసి, వెన్నెల కిషోర్, కీర్తి సురేష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ మూవీ వేదాళం అధికారిక తెలుగు రీమేక్. ఇప్పుడు తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ షెడ్యూల్ కి ఒక భారీ సెట్‌ను మూవీ మేకర్స్ నిర్మించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ రెండు చిత్రాలను కూడా విడుదల చేశారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa