కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ ఇప్పుడు "రాకెట్రీ:ది నంబి ఎఫెక్ట్" సినిమా కోసం రైటర్ గా మారగా, ఈ సినిమాను ఆయనే డైరెక్ట్ చేస్తున్నారు. 1994లో అరెస్టయిన ISRO మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నారు. ఈ బయోగ్రాఫికల్ మూవీ జూలై 1, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ అండ్ సూర్య అతిధి పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించినందుకు స్టార్ హీరోస్ ఇద్దరు కూడా ఒక్క పైసా కూడా తీసుకోలేదని లేటెస్ట్ టాక్. అంతేకాకుండా కారవాన్‌లు మరియు కాస్ట్యూమ్స్ కోసం కూడా ఎటువంటి డబ్బు వసూలు చేయలేదు అని సమాచారం. సిమ్రాన్ బగ్గా, రజిత్ కపూర్, మిషా ఘోషల్, రవి రాఘవేంద్ర, గుల్షన్ గ్రోవర్, కార్తీక్ కుమార్, దినేష్ ప్రభాకర్ కీలక పాత్రలు పోషించారు. రాకెట్రీ సినిమా హిందీ, తెలుగు, ఇంగ్లీష్, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. త్రివర్ణ చిత్రాలు, వర్గీస్ మూలాన్ పిక్చర్స్ మరియు 27వ ఇన్వెస్ట్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.