తమిళ హీరో శివకార్తికేయన్ జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ తో డైరెక్ట్ తెలుగు మూవీ తీస్తున్నారు అని అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన జోడిగా ఉక్రెయిన్ బ్యూటీ మెరీనా ర్యాబోషప్కా కనిపిస్తుందని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకి 'ప్రిన్స్' అని టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. కామెడీ ఎంటర్‌టైనర్‌ట్రాక్ లో రానున్న ఈ సినిమా దీపావళికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను హాట్‌స్టార్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ-తెలుగు మూవీకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మనోర్ పరమహంస కెమెరా క్రాంక్ చేయనున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ LLP, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.