ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశ్వక్ సేన్ తదుపరి చిత్రానికి డైలాగ్ రైటర్‌గా ప్రముఖ రచయిత

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 22, 2022, 02:44 PM

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌తో దర్శకుడిగా తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో విశ్వక్ సేన్‌ సరసన జోడిగా అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ నటించనుంది. ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు. తాజగా ఇప్పుడు, ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్ రైటర్‌గా ఉన్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో జగపతి బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అర్జున్ తన హోమ్ బ్యానర్ శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa