కంగనా రనౌత్.. కాంట్రవర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్. ఆమె నటించిన మణికర్ణిక చిత్రం అతి త్వరలో విడుదల కానుంది. క్రిష్ దర్శకత్వంలో మణికర్ణిక తెరకెక్కగా, ఝాన్సీ లక్ష్మీ బాయి జీవిత నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక కంగనా తన తదుపరి సినిమాలో కబడ్డీ ప్లేయర్‌గా కనిపించనుందట. ఇందుకోసం కబడ్డీ ఆటపైన పూర్తి దృష్టి పెట్టిందట. ఓ పెళ్లైన అమ్మాయి జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్‌గా ఎలా సత్తా చాటింది? అనే బ్యాక్‌డ్రాప్‌లో చిత్రం రూపొందనుండగా, దీనికి ‘పంగా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు ‘బరేలీ కీ బర్ఫీ ఫేమ్’ అశ్వనీ అయ్యర్ తివారీ దర్శకత్వం వహించనున్నారు. నీనా గుప్తా, జెస్సీ గిల్ కీలక పాత్రలు చేయనున్నారు. చిత్రంలో కంగనా రనౌత్ భర్తగా జెస్సీ గిల్ కనిపిస్తారట. చిత్రంలో తన పాత్రకి పూర్తి న్యాయం చేసేందుకు ఓ కోచ్ సమక్షంలో తాను కోచింగ్ తీసుకోవాలని భావిస్తుందట. ఇందుకోసం పలువురితో చర్చలు జరిపిందట కంగనా. పాత్ర కోసం ఎంతటి రిస్క్ అయిన చేసేందుకు ఈ కాలం నటీనటులు ఎంతగానో ప్రయత్నిస్తుండగా, కంగనా పంగా సినిమా కోసం కబడ్డీ నేర్చుకోవాలనుకోవడం సంతోషించదగ్గ విషయమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa