ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ప్రధాన పాత్రల్లో తెరకెక్కెతున్న మూవీ నీవెవరో. రచయిత కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.. హరినాధ్ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు.. ఈ మూవీలో ఆది అంధుడిగా కనిపించనున్నాడు. ఇక ఈ మూవీ కన్నడ మూవీ అదే కంగల్ కు రీమేక్. ఒరిజినల్ వెర్షన్‌లో కలైయారసన్ హరికృష్ణనన్ కనిపించిన పాత్రలో ఆది నటించనున్నాడట. ఇదే కథతో తెలుగు, తమిళ భాషల్లో నీవెవరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుంది.. యు/ఎ సర్టిఫికెట్ లభించింది. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడకను రేపు విశాఖపట్నంలో నిర్వహించనున్నారు.. ఈ మూవీ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa