నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే ఘటనల్లో కొన్ని షాకింగ్‌గా అనిపిస్తాయి. మరికొన్ని ఆందోళనకు గురిచేస్తాయి. ఇంకొన్ని ఇలాంటి వ్యక్తుల మధ్య, ఇలాంటి సమాజంలో మనం ఉన్నామా అనే భయానికి కారణమవుతాయి. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు ఇలాగే ఆందోళనకు కారణమవుతోంది. ఈ రోజులలో మనుషులకే కాదు.. పశువులకు కూడా రక్షణ లేదా అనేలా ఈ ఘోరం చోటుచేసుకుంది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే రీతిలో.. ఓ గోమాతపై లైంగిక దాడి జరిగింది. నోరులేని ఓ మూగజీవిపై మైనర్లు దారుణానికి ఒడిగట్టారు. నీతిమాలిన, నీచమైన పనికి పాల్పడటమే కాకుండా.. ఈ దారుణ కాండను వీడియో తీసి మిగతావారితో పంచుకోవటం.. వారి మానసిక స్థితి ఎలా ఉందనే దానికి అద్దం పడుతోంది.
అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం బురకాయలకోటలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన ఐదారు రోజుల కిందట జరిగినట్లు సమాచారం. గ్రామానికి చెందిన నలుగురు మైనర్లు.. ఓ ఆవు దూడను ఊరవతలకి తీసుకెళ్లారు. ఆ తర్వాత అందులో ఒక బాలుడు ఆవు దూడపై అఘాయిత్యానికి పాల్పడగా.. మరో బాలుడు వీడియో తీశాడు. ఈ సమయంలో మరో ఇద్దరు మైనర్లు అక్కడే ఉన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన అనంతరం ఈ వీడియోనూ ఊర్లోని తమ స్నేహితులకు షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది.
దీంతో ఈ విషయం బురకాయలకోట ఊరిజనంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాలకు పాకింది. ఈ నేపథ్యంలో ఆవు దూడపై అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాలు శుక్రవారం రోజున ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీసులు నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ములకలచెరువు పోలీస్ స్టేషన్‌కు వారిని తరలించి విచారిస్తు్న్నారు. ఈ ఘటనతో బురకాయలకోట గ్రామంలో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు మండిపడుతున్నారు. గోమాతను దేవతగా పూజించే మనదేశంలో ఇలాంటి దారుణం ఏమిటని మండిపడుతున్నారు. తెలిసి చేసినా, తెలియకచేసినా తప్పేనని ఆవు దూడపై అఘాయిత్యానికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa