ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లండన్ వీధుల్లో అకాయ్‌తో కలిసి కోహ్లీ సందడి....సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

sports |  Suryaa Desk  | Published : Tue, Mar 03, 2026, 10:16 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం కుటుంబంతో సమయం గడుపుతున్నాడు. భార్య అనుష్క శర్మ, కూతురు వామిక, కొడుకు అకాయ్‌తో కలిసి లండన్‌లో ఉంటున్నాడు. తన పిల్లల గోప్యతను కాపాడేందుకు.. ప్రజల దృష్టి నుంచి దూరంగా ఉండేందుకు తన నివాసాన్ని భారత్ నుంచి మార్చుకున్నాడు. తాజాగా విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో లండన్ వీధుల్లో కోహ్లీ.. తన కొడుకు అకాయ్‌తో కలిసి నడుస్తున్నట్లు ఉంది.


2024లో ఫిబ్రవరి 15 విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులకు రెండో సంతానంగా ఆకాయ్ పుట్టాడు. అప్పటి నుంచి అకాయ్.. లండన్‌లోనే ఉంటున్నాడు. అయితే అతడి ఫొటోలు మాత్రం ఇప్పటివరకూ బహిర్గతం కాలేదు. ఇక అకాయ్.. తన తండ్రి విరాట్ కోహ్లీతో పాటు లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో కోహ్లీ, అకాయ్ రోడ్డుపై నడుస్తున్నట్లు ఉంది. ఈ సమయంలో రోడ్డుపై కనిపంచిన ఓ వ్యక్తితో కోహ్లీ, అతడి కొడుకు కాసేపు మాట్లాడినట్లు వీడియో ఉంది. అకాయ్.. నడిచే క్రమంలో తన తండ్రి కోహ్లీ చేయి పట్టుకుని కనిపించాడు.


ఓ అభిమాని ఈ దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఇది వెంటనే వైరల్‌గా మారిపోయింది. ఇది చూసిన నెటిజన్లు క్యూట్ వీడియో అని కామెంట్లు చేస్తున్నారు.


కాగా టీ20, టెస్టులకు గుడ్‌బై చెప్పిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం కేవలం వన్డేలో మాత్రమే ఆడుతున్నాడు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2026 జరుగుతుండటంతో లండన్‌లోనే ఉంటున్నాడు. ఈ నెల చివర్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున పాల్గొనేందుకు కోహ్లీ.. మరికొన్ని రోజుల్లో భారత్‌కు రానున్నాడు. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ.. గత సీజన్‌లో ఐపీఎల్ టైటిల్ సాధించింది. ఇక వచ్చే సీజన్‌లోనూ ఆర్సీబీ.. ఐదు లీగ్‌ మ్యాచ్‌లను హోంగ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో ఆడనుంది. ఈ విషయాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ మంగళవారం వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa