ఫ్యాషన్ ప్రపంచంలో డ్రెస్సింగ్ స్టైల్ ఎంత ముఖ్యమో, దానికి తగ్గ యాక్సెసరీస్ ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా టాప్స్ రకాన్ని బట్టి చెవులకు పెట్టుకునే కమ్మలు ఎంచుకుంటేనే ఆ లుక్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలామంది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూసి కొత్త స్టైల్స్ ప్రయత్నిస్తుంటారు కానీ, సరైన కాంబినేషన్ కుదరక ఇబ్బంది పడుతుంటారు. ఏ రకమైన టాప్కు ఎలాంటి ఇయరింగ్స్ పెట్టుకుంటే పear top
స్కూప్ నెక్ టాప్స్ చాలా క్యాజువల్, కంఫర్టబుల్ లుక్‌ని ఇస్తాయి. ఇవి మెడ భాగాన్ని ఎక్కువగా చూపిస్తాయి. ఇటువంటి టాప్స్ ధరించినప్పుడు చెవులకు హూప్స్ ఇయరింగ్స్ చాలా బాగుంటాయి. హూప్స్ చిన్నగా లేదా పెద్దగా, మీ ఇష్టాన్ని బట్టి ఎంచుకోవచ్చు. ఇవి మీ ఫేస్ ఫీచర్స్‌ను మరింత హైలైట్ చేస్తాయి. హూప్స్ కాంబినేషన్ చాలా క్లాసీగా, ట్రెండీగా కనిపిస్తుంది. డే టైం ఔటింగ్స్‌కు, ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లేటప్పుడు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది.
ఆఫ్ ది షోల్డర్ డ్రెస్‌లకు ఏంటంటే
ఆఫ్ ది షోల్డర్ టాప్స్, డ్రెస్సులు చాలా బోల్డ్, పార్టీ వేర్ లుక్‌ని ఇస్తాయి. ఇక్కడ మెడ, షోల్డర్ భాగం పూర్తిగా ఖాళీగా ఉంటుంది. అటువంటి సమయాల్లో షాండ్లియర్ ఇయరింగ్స్ లేదా పెద్ద జుంకాల వంటివి ధరించడం వల్ల ఆకర్షణీయంగా ఉంటారు. షాండ్లియర్ కమ్మలు మీ షోల్డర్ లైన్‌ను మరింత ఎలిగెంట్‌గా చూపుతాయి. ఇది మిమ్మల్ని పార్టీలో స్పెషల్ అట్రాక్షన్‌గా మారుస్తుంది. ఈ కాంబినేషన్ డ్రామాటిక్ లుక్‌ని కోరుకునే వారికి చాలా బాగా నచ్చుతుంది.
స్క్వేర్ నెక్ టాప్స్‌కు ఇవైతే బాగుంటాయి
స్క్వేర్ నెక్ టాప్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇవి ఒక పద్ధతిగా, మినిమలిస్టిక్ లుక్‌ని ఇస్తాయి. ఇటువంటి టాప్స్ ధరించినప్పుడు జియోమెట్రిక్ డిజైన్ కలిగిన కమ్మల్ని ఎంచుకోవడం మంచిది. స్క్వేర్, ట్రయాంగిల్, లేదా రౌండ్ షేప్ కమ్మలు స్క్వేర్ నెక్ టాప్స్‌తో చాలా చక్కగా సరిపోతాయి. ఇవి మీ అవుట్‌ఫిట్‌కు పర్ఫెక్ట్ ఫ్రేమింగ్‌ను ఇస్తాయి. ఆఫీస్ వేర్‌కు లేదా ఫార్మల్ మీటింగ్స్‌కు ఈ స్టైల్ చాలా బాగుంటుందికాలర్ షర్ట్స్ కోసం ఇవి ఎంచుకోండి
కాలర్ షర్ట్స్, ఫార్మల్ టాప్స్ చాలా ప్రొఫెషనల్, క్లాసీ లుక్‌ని ఇస్తాయి. ఇటువంటి దుస్తులు ధరించినప్పుడు పెద్ద కమ్మలు అసలు బాగోవు. కాలర్ ఉన్నప్పుడు కమ్మలు చాలా సింపుల్‌గా ఉండాలి. అందుకే చిన్న హూప్స్ లేదా పెరల్స్ ఇయరింగ్స్ మంచి ఛాయిస్. ఇవి మీ ఫేస్‌కు చాలా డీసెంట్ లుక్‌ని ఇస్తాయి. పెరల్స్ మీ స్టైల్‌కి ఒక క్లాసిక్ టచ్‌ను ఇస్తాయి. ప్రొఫెషనల్ మీటింగ్స్‌లో ఆఫీస్‌లో ఈ యాక్సెసరీస్ చాలా బాగుంటాయి.
అవి సింపుల్‌గా ఉంటే ఇవి హెవీగా ఉండాలి
మీరు ధరించే ప్రతి యాక్సెసరీ.. వెళ్లే సందర్భాన్ని బట్టి ఉండాలి. టాప్స్, ఇయరింగ్స్ మధ్య బ్యాలెన్స్ ఉంటేనే మీ స్టైల్ అద్భుతంగా ఉంటుందని నవ్‌నీత్ చోప్రా తెలిపారు. దుస్తులు సింపుల్‌గా ఉంటే కమ్మలు కాస్త డిజైన్ ఉన్నవి పెట్టుకోవచ్చు. అదే దుస్తులు హెవీగా ఉంటే కమ్మలు సింపుల్‌గా ఉంచడం మంచిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa