ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విక్రమ్ "కోబ్రా"కు అదనపు ఆకర్షణగా మరో స్టార్ హీరో!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 28, 2022, 12:46 PM

చియాన్ విక్రమ్ నటిస్తున్న కొత్త చిత్రం "కోబ్రా". క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఆర్. జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 11న విడుదలవబోతున్న ఈ చిత్రానికి ఏ. ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో కేజీఎఫ్ భామ శ్రీనిధిశెట్టి హీరోయిన్. మాజీ ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ మూవీ తమిళనాడు థియేటర్ హక్కులను మరో కోలీవుడ్ స్టార్ హీరో కం డిస్ట్రిబ్యూటర్ కం ప్రొడ్యూసర్ ఉదయనిధి స్టాలిన్ చేజిక్కించుకున్నారట. ఈ విషయాన్ని ఉదయనిధి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. స్టాలిన్ తన హోమ్ బ్యానర్ రెడ్ జెయింట్ మూవీస్ పై ఈ చిత్రాన్ని తమిళనాడులో సొంతంగా విడుదల చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa