టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా నటిస్తున్న కొత్త చిత్రం "ది వారియర్". ఎన్. లింగుసామి డైరెక్షన్లో తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుండి ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లు, లిరికల్ సాంగ్స్, టీజర్ ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ సంపాదించుకున్నాయి.
తాజాగా ది వారియర్ థియేట్రికల్ ట్రైలర్ ను జూలై 1వ తేదీన రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రామ్ కెరీర్లో తొలిసారి పోలీసాఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాపై ఆయన అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో అక్షర గౌడ మరొక హీరోయిన్ గా నటిస్తుంది.