గ్లామర్ బ్యూటీ లావణ్య త్రిపాఠి చివరిగా తెలుగులో 'చావు కబురు చల్లగా' సినిమాలో కనిపించింది. ఈ సిజ్లింగ్ బ్యూటీ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ షూటింగ్‌లో బిజీగా ఉంది. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి 'హ్యాపీ బర్త్‌డే' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం జూలై 8, 2022న థియేటర్లలో విడుదల కానుంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈరోజు AMB సినిమా థియేటర్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ రాజమౌళి లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa