తాము విడాకులు తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తలపై టాలీవుడ్ సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి పరోక్షంగా స్పందించారు. తన ఫాలోవర్లు, సంపాదన పెరిగిందని, అంతా మీడియా దయ అని శ్రావణ భార్గవి ఇన్ స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. అలాగే హేమచంద్ర కూడా కొంతమంది అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటారు అని పోస్ట్ పెట్టాడు. ఇద్దరూ తమ పోస్టుల్లో ఒకరినొకరు ట్యాగ్ చేసుకున్నారు. దీంతో తాము విడిపోవడం లేదని క్లారిటీనిచ్చారు.