టాలీవుడ్ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న చిత్రం "కార్తికేయ 2". చందూ మొండేటి డైరెక్షన్లో నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ మిస్టరీ ఫాంటసీ మూవీని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. కాలభైరవ సంగీతం అందించిన ఈ సినిమా జూలై 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజాగా ఈ మూవీపై లేటెస్ట్ న్యూస్ ఏంటంటే..., షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అవి కూడా ఫైనల్ స్టేజ్ కు వచ్చేసినట్టు తెలుస్తుంది. ఈ మేరకు అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియా స్టోరీ మనకు సమాచారం అందిస్తుంది. కార్తికేయ 2 మలయాళం డబ్బింగ్ ను పూర్తి చేసినట్టు అనుపమ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులకు తెలియచేసింది. మిగిలిన నటీనటుల డబ్బింగ్ కూడా ఫైనల్ స్టేజ్ లో ఉందంట. ఇక, త్వరలోనే ప్రమోషన్స్ మొదలెట్టనుంది చిత్రబృందం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa