జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘కాట్రిన్ మొళి’. ఈ చిత్రంలో మంచు లక్ష్మి ఓ కీలకమైన పాత్రను పోషిస్తుండగా తమిళ్ హీరో శింబు అతిథి పాత్రలో కనిపిస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసుకుంది.తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని అక్టోబరు 18వ తేదీన దసరా సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోఫ్తా మీడియా వర్క్స్ పతాకం పై ధనుంజయన్ గోవింద్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa