నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తూహ్న సినిమా 'దసరా'. ఈ సినిమాలో హీరోయినిగా కీర్తి సురేశ్ నటిస్తుంది.ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలపై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్పందించారు. షూటింగ్ ఆగిపోయిందన్న వదంతులను నమ్మవద్దని తెలిపారు.ఈ సినిమా షూటింగ్ అనుకున్న ప్రకారం జరుగుతోందని తెలిపారు. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌లు ఇస్తూనే ఉంటాం అని అనవసరమైన పుకార్లను నమ్మవద్దని అన్నారు.