మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా 'గాడ్ ఫాదర్'. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. తాజగా ఈరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.ఈ సినిమాలో నయనతార ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు.ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తునాయి. ఈ ఏడాది దసరాకు రిలీజ్ కానుంది.