RRR, గంగూబాయ్ కతియావాడి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించిన బాలీవుడ్ బ్యూటీ క్వీన్ అలియా భట్, జస్మీత్ కె రీన్ దర్శకత్వంలో 'డార్లింగ్స్' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ కామెడీ డ్రామాలో షెఫాలీ షా, విజయ్ వర్మ మరియు రోషన్ మాథ్యూ కూడా కీలక పాత్రల్లో నటించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆగస్టు 5, 2022న ప్రసారానికి అందుబాటులోకి రానుంది అని ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. అంతేకాకుండా, నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా టీజర్‌ను కూడా షేర్ చేసింది. విశాల్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa