ట్రెండింగ్
Epaper    English    தமிழ்

NBK 107 లేటెస్ట్ షెడ్యూల్ డీటెయిల్స్...!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 06, 2022, 04:27 PM

"క్రాక్" వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపీచంద్ మలినేని నటసింహం బాలకృష్ణ తో సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని ఈ సినిమాకు "జై బాలయ్య" అనే సూపర్ పాపులర్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఇటీవల బాలయ్య కోవిడ్ కు గురికావడంతో ఈ మూవీ షూటింగ్ కు కాస్త బ్రేక్ పడింది. ప్రస్తుతానికి బాలయ్య కోవిడ్ నుండి కోలుకుని షూటింగ్ లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.
NBK 107 లేటెస్ట్ షెడ్యూల్ అమెరికాలో జూలై 9 నుండి జరుగుతుందని ప్రచారం జరిగింది...కానీ, వీసా సమస్యల వల్ల ఈ షెడ్యూల్ టర్కీ కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ జరగబోయే షెడ్యూల్ లో బాలయ్య అండ్ టీం పై హై ఆక్టేన్ యాక్షన్ సీన్లను తెరకెక్కించనున్నారట గోపీచంద్.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కధానాయిక కాగా, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా విడుదలకాబోతుంది.    






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com