యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, లింగుస్వామి దర్శకత్వంలో "వారియర్" సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ డ్రామా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి అండ్ అక్షర గౌడ కథానాయికలుగా నటించారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నారు. జులై 14, 2022న ఈ సినిమాని థియేటర్లలో విడుదల కానుంది. తాజా అప్డేట్ ప్రకారం, 'ది వారియర్' తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ జూలై 10, 2022 న జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఈవెంట్ హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్స్‌లో జరుగుతుంది అని సమాచారం. ఈ విషయం పై మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.