టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోల్లో ఒకరు ఆది సాయికుమార్. హిట్లు లేకపోయినా ఆది చేతినిండా సినిమాలున్నాయంటే, దర్శకనిర్మాతలకు ఆయనంటే ఎంత నమ్మకమో క్లియర్ గా తెలుస్తుంది.
తాజాగా ఆది నటిస్తున్న కొత్త చిత్రం "క్రేజిఫెలో". ఇటీవలనే ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ల ను రిలీజ్ చెయ్యగా ఆడియన్స్ నుండి మంచి అప్లాజ్ వచ్చింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ఎనౌన్స్ చేసారు. ఈ మేరకు సెప్టెంబర్ 16న క్రేజీ ఫెలో సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని తెలిపారు. టైటిల్ కు తగ్గట్టుగానే సినిమాలో కూడా ఆది లుక్ అండ్ రోల్ క్రేజీగా ఉండనున్నట్టు తెలుస్తోంది. సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో ఫణికృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. దిగాంగాన సూర్యవన్షి, మిర్ణా మీనన్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ ఆర్ ధ్రువ సంగీతం అందిస్తున్నారు.