ట్రెండింగ్
Epaper    English    தமிழ்

RC 15 : చెర్రీతో వింత ప్రయోగం చేయిస్తున్న శంకర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 09, 2022, 11:45 AM

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా సక్సెస్ ను శంకర్ తో చేసే సినిమాతో కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ బాణీలందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ మూవీ పై వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఇందులో చెర్రీ డ్యూయల్ రోల్ లో మూడు విభిన్న పాత్రలలో నటించనున్నాడు. షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఇందులో విలన్గా కూడా చెర్రీ నే నటిస్తున్నాడట. ఈ మేరకు ఫిలిం నగర్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాలో నటించబోయే విలన్ పై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ వార్తలో నిజముందనిపిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa