తనికెళ్ల భరణి అంటే తెలియని వారుండరు. నాటకాలు, రచన, సినిమా, ఆధ్యాత్మిక రంగాల్లో ఆయన ప్రత్యేకత వేరు. నేడు భరణి జన్మదినం. పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరులోని జగన్నాధపురంలో ఆయన 1954లో పుట్టారు. బి.కామ్ అయ్యాక నాటకాలవైపు మళ్లి ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించారు. 40 ఏళ్ళ సినీ కెరీర్, 15ఏళ్ళకుపైగా నాటకరంగం, 50కి పైగా కథరాచనలు చేసిన భరణి ఎప్పటికీ నవ్వుతూనే ఉంటారు. హ్యాపీ బర్త్ డే సార్.