బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ప్రఖ్యాత డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి కాంబోలో తొలిసారి తెరకెక్కబోతున్న చిత్రం "డంకి". హీరోయిన్ తాప్సి ఇందులో ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఇటీవలే ఈ సినిమా అధికారిక ప్రకటన జరిగింది. ఇద్దరు సూపర్ స్టార్లు కలవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ టీంలో ఇన్నర్ డిస్ప్యూట్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ కారణంగానే సినిమాటోగ్రాఫర్ అమిత్ రాయ్ ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేసారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే పేర్కొన్నారు. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణికి తనకు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తాయని, తాను తప్పుకోకపోతే గొడవ మరింత పెరగొచ్చనే ఆలోచనతో ప్రాజెక్ట్ ను వదులుకున్నట్టు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa