"SR కళ్యాణమండపం" తో టాలీవుడ్ ఇండస్ట్రీని, ప్రేక్షకులను ఒక్కసారిగా ఆకర్షించిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. నేడు కిరణ్ తన 30వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా అధికారిక ప్రకటన జరిగింది.
టాలీవుడ్లో మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం. 5 గా, కిరణ్ అబ్బవరం తో ఒక సినిమా ఎనౌన్స్మెంట్ నిన్న జరిగింది. కిరణ్ కెరీర్లో ఆరవ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను కొంచెంసేపటి క్రితమే మేకర్స్ రివీల్ చేసారు. ఈ సినిమాకు "మీటర్" అనే క్యాచీ టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఫస్ట్ లుక్ లో కిరణ్ ఊరమాస్ స్టెప్ వేస్తూ, కళ్లద్దాలు, మేడలో కర్చీఫ్ ఔటండౌట్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు రమేష్ కదురి డైరెక్షన్ చేస్తుండగా, తమిళ హీరోయిన్ అతుల్య ఫిమేల్ లీడ్ లో నటిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందిస్తుండగా, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ మరో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa