తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తన 20వ చిత్రం "ప్రిన్స్" ను తెలుగు దర్శకుడు, జాతిరత్నాలు ఫేమ్ కే.వి అనుదీప్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే కదా. ఈ సినిమా తెలుగు, తమిళం లలో రూపొందుతుంది.
తాజాగా శివకార్తికేయన్ మరొక సినిమాను కూడా ఎనౌన్స్ చేసాడు. ఈ సినిమాకు మడోన్నా అశ్విన్ డైరెక్టర్ కాగా, తమిళం, తెలుగు రెండు భాషలలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ మూవీ టైటిల్ ఎనౌన్స్మెంట్ టీజర్ ను కొంచెంసేపటి క్రితమే సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసారు. ఈ సినిమాకు తమిళంలో "మావీరన్", తెలుగులో "మహావీరుడు" అనే టైటిల్స్ ను ఫిక్స్ చేసారు. ఇక, ఎనౌన్స్మెంట్ వీడియో చాలా ఇంటరెస్టింగ్ గా సాగింది. ఈ విడియోతోనే ఈ సినిమా పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుందని తెలుస్తుంది. శాంతి టాకీస్ ఈ సినిమాను నిర్మిస్తుంది.