అక్కినేని వారసుడు అఖిల్ కెరీర్లో తొలిసారి భారీ బడ్జెట్ తో నిర్మింపబడుతున్న చిత్రం "ఏజెంట్". సురేందర్ రెడ్డి డైరెక్షన్లో సూపర్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాక్షివైద్య అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ మూవీ టీజర్ ఈరోజు సాయంత్రం 5:05 నిమిషాలకు విడుదల కాబోతుంది. హైదరాబాద్, కూకట్ పల్లిలోని మల్లిఖార్జున థియేటర్లో జరగనున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు కిచ్చా సుదీప్, ప్రిన్స్ శివకార్తికేయన్ ముఖ్య అతిథులుగా హాజరై, టీజర్ ను రిలీజ్ చెయ్యనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 12న తెలుగు, తమిళం, మలయాళం హిందీ, కన్నడ భాషలలో విడుదల కాబోతుంది.