ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇథియోపియాలో మోడీ ముందర 'వందేమాతరం' ఆలపించిన గాయకులు

international |  Suryaa Desk  | Published : Wed, Dec 17, 2025, 04:15 PM

ప్రధాని నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనలో భాగంగా ఇథియోపియాలో పర్యటిస్తున్నారు. జోర్డాన్ పర్యటన ముగించుకుని ఇథియోపియా చేరుకున్న ఆయనకు అక్కడ అరుదైన, మర్చిపోలేని స్వాగతం లభించింది. 15 ఏళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటిస్తున్న భారత ప్రధానికి గౌరవ సూచకంగా ఇథియోపియా గాయకులు భారత జాతీయ గీతం 'వందేమాతరం' ఆలపించారు. ఈ అద్భుత ప్రదర్శనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్.. ప్రధాని మోదీ గౌరవార్థం ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా స్థానిక గాయకులు 'వందేమాతరం' గీతాన్ని ఎంతో శ్రావ్యంగా ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. తమ దేశానికి వచ్చిన భారత ప్రధానికి ఈ విధంగా స్వాగతం పలికారు. ఈ పరిణామంతో పులకించిపోయిన ప్రధాని మోదీ.. గాయకుల ప్రదర్శనను చప్పట్లతో అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa