పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన "రొమాంటిక్" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యంగ్ అండ్ గ్లామర్ బ్యూటీ కేతికశర్మ. తొలి సినిమాలోనే కావాల్సింత గ్లామర్ షో చేసి తగినంత గుర్తింపును, యువతలో క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ వెంటనే నాగశౌర్య తో "లక్ష్య" చేసింది కానీ ఒక సాలిడ్ హిట్ ఐతే ఇప్పటివరకు కేతిక అందుకోలేదు. ప్రస్తుతం కేతిక ఆశలన్నీ మెగమేనల్లుడి పైనే.
మెగామేనల్లుడు వైష్ణవ్ తేజ్ సరసన "అంగరంగవైభవంగా" సినిమాలో కేతిక ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 2వ తేదీన విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా కేతికకు ఒక గోల్డెన్ అపర్చ్యునిటీ వచ్చినట్టు తెలుస్తుంది.
అదేంటంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమిళ రీమేక్ "వినోదయ సిత్తం" లో కేతిక ఛాన్స్ కొట్టేసిందని ఇండస్ట్రీ టాక్. విలక్షణ నటుడు సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కిన తమిళ్ మూవీ వినోదయ సిత్తం ను తెలుగులో పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ పెట్టి రీమేక్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఇందులో సాయిధరమ్ కు జోడిగా కేతిక ఎంపికైనట్టు తెలుస్తుంది. తమ్ముడి హీరోయిన్ తో సాయిధరమ్ నటించబోతున్నాడంటూ జరుగుతున్న ప్రచారం పై ఇంకా క్లారిటీ రావలసి ఉంది. అంతేకాక, అసలు ఈ ప్రాజెక్ట్ అధికారికమా? లేక కేవలం పుకారేనా? అన్నది కూడా తెలియాల్సి ఉంది.