ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాటా సియెరా: ఒక రోజులో 70,000 బుకింగ్స్ తో సంచలనం

business |  Suryaa Desk  | Published : Wed, Dec 17, 2025, 08:31 PM

టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ అమ్మకాలు నవంబర్ లో 25.6% పెరిగి 59,199 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో, నవంబర్ లో విడుదలైన కొత్త టాటా సియెరా కారుకు డిసెంబర్ 16న రికార్డు స్థాయిలో 70,000 బుకింగ్స్ వచ్చాయి. 1991లో విడుదలై, 2003లో నిలిచిపోయిన ఈ కారును 'రీబర్త్ ఆఫ్ ఎ లెజెండ్'గా అప్ డేటెడ్ వెర్షన్ తో టాటా మోటార్స్ తిరిగి తీసుకొచ్చింది.  20కి పైగా భద్రతా ఫీచర్లతో, ఫైవ్ స్టార్ రేటింగ్ తో వస్తున్న ఈ కారుకు జనవరి 15 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa