కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటిస్తున్న కొత్త చిత్రం "లాఠీ". ఏ. వినోద్ కుమార్ డైరెక్షన్లో ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశాల్ పవర్ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నారు. రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ నందా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సునయన నటిస్తుంది. సామ్ సిఎస్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ షూటింగ్ కు ఎండ్ కార్డు పడింది. ఈ విషయాన్నిమేకర్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. తమిళంతో పాటు, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 15న థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్.