కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఒకేసారి రెండు సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. వినోద్ కుమార్ డైరెక్షన్లో "లాఠీ" షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతుండగా, అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో రూపొందుతున్న "మార్క్ ఆంటోనీ" ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
మార్క్ ఆంటోనీ పై లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఈ ఏడాది మే లో ప్రారంభమైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కొన్ని కీలక షెడ్యూల్స్ ను ముగించుకుంది. జూలై 18 నుండి చెన్నైలో కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చెయ్యబోతుంది మూవీ టీం.
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశాల్ కు జోడిగా హీరోయిన్ రీతూ వర్మ నటిస్తుంది. GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మినీ స్టూడియోస్ బ్యానర్ పై వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు.