లేడీ పవర్ స్టార్‌గా సాయిపల్లవికి క్రేజ్ ఉంది. రీసెంట్‌గా ఆమె నటించిన 'గార్గి' సినిమా ఈనెల 15న విడుదలైంది. థియేటర్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా రెస్పాన్స్‌ను స్వయంగా చూసేందుకు సాయిపల్లవి థియేటర్స్‌లో సందడి చేసింది. చెన్నై, హైదరాబాద్‌లోని పలు థియేటర్లకు వెళ్లి ఫ్యాన్స్‌తో కలిసి సినిమాను చూసి, వారితో కాసేపు సరదాగా ముచ్చటించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.