ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాశ్మీర్ ఫైల్స్ నిర్మాతలు విడుదల చేసిన "కార్తికేయ 2" హిందీ టీజర్ 

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 19, 2022, 05:55 PM

యంగ్ హీరోహీరోయిన్లు నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం "కార్తికేయ 2".  చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన కార్తికేయ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష కీలకపాత్రలు పోషిస్తున్నారు. జూలై 22వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆగస్టు మొదటి వారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే.
తాజాగా కార్తికేయ 2 హిందీ టీజర్ కొంచెంసేపటి క్రితమే విడుదలైంది. లార్డ్ కృష్ణ కు సంబంధించిన ప్రపంచవ్యాప్త సదస్సు బృందావన్, కలకత్తా (ఇస్కాన్) ప్రెమిసెస్ లో, దేశం మెచ్చిన "ది కాశ్మీర్ ఫైల్స్" మేకర్స్ చేతుల మీదుగా ఈ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa