దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో సునీల్, అనసూయ భరద్వాజ్, సుధీర్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, సప్తగిరి, శ్రీనివాస రెడ్డి ముఖ్యపాత్రలు పోషించిన చిత్రం "వాంటెడ్ పండుగాడ్". పట్టుకుంటే కోటి శీర్షిక. లేటెస్ట్ గా ఈ మూవీలో రథి పాత్రలో నటిస్తున్న నిత్యాశెట్టి కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ కొంచెంసేపటి క్రితమే విడుదల చేసారు. శ్రీధర్ సీపాన దర్శకత్వంలో సాయిబాబా కోవెలమూడి,వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి అప్లాజ్ వస్తుంది. హిలేరియస్ ఎంటెర్టైన్మెంట్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే ప్రముఖ రచయిత జనార్ధన మహర్షి అందిస్తున్నారు. ఆగస్టు 19న థియేటర్లలో ఈ సినిమా విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa