ఢిల్లీలో పెరుగుతున్న గాలి కాలుష్యం నేపథ్యంలో, బీఎస్4 వాహనాలపై నిషేధం విధించి, బీఎస్6 వాహనాలకు మాత్రమే అనుమతిస్తూ అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలు జారీ చేసింది. 2020 ఏప్రిల్ వరకు బీఎస్4 వాహనాలు తయారయ్యేవి, ఆ తర్వాత భారత ప్రభుత్వం వాయు కాలుష్యం తగ్గించేందుకు బీఎస్6 వాహనాల తయారీని తప్పనిసరి చేసింది. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) లోని 'ఎమిషన్ నార్మ్స్ / బీఎస్ నార్మ్స్' కాలమ్లో BS-IV లేదా BS-4 అని ఉంటే అది బీఎస్4 వాహనం, లేదంటే బీఎస్6 వాహనం. కొన్ని కంపెనీలు వాహనంపైనే ఈ వివరాలను పేర్కొంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa