ప్రముఖ కాఫీ దిగ్గజం స్టార్‌బక్స్ తమ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా (CTO) భారతీయ సీనియర్ టెకీ ఆనంద్ వరదరాజన్‌ను నియమించింది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు సాంకేతికతను మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరులో పదవీవిరమణ చేసిన డెబ్ హాల్ లెఫెవ్రే స్థానంలో ఆనంద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థి అయిన ఆనంద్, అమెజాన్‌లో 19 ఏళ్లు పనిచేసిన అనుభవం కలిగి ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa