సితార ఘట్టమనేని... తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల గారాల పట్టి. యూట్యూబ్ ట్యుటోరియల్స్, ఇంస్టాగ్రామ్ వీడియోస్ తో సితార బాగా పాపులర్ అయ్యింది. ఈ మధ్యనే మహేష్ కొత్త సినిమా 'సర్కారువారిపాట'లో పెన్నీ సాంగ్ తో టాలీవుడ్ కు అఫీషియల్ ఎంట్రీ ఇచ్చింది ఈ మల్టీ టాలెంటెడ్ కిడ్.
ఈరోజు సితార 10వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా మహేష్ తన సోషల్ మీడియా ఖాతాలలో కూతురికి బర్త్ డే విషెస్ ను తెలిపారు. నా ప్రపంచంలో దేదీప్యమానంగా వెలిగే సి'తార'కు పుట్టిన రోజు శుభాకాంక్షలు...చూస్తుండగానే పదేళ్లు వచ్చేసాయి... పదిరెట్లు ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను... అంటూ సింపుల్, స్వీట్ గా సితార కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేసారు.