టాలీవుడ్ టాప్ హీరోయిన్, బాలీవుడ్ లో ఒక్క సినిమా చేయకున్నా అక్కడ బాగా పాపులర్ ఐన హీరోయిన్ సమంత. బాలీవుడ్ సూపర్ పాపులర్ షోలో పాల్గొన్న తొలి సౌత్ సెలెబ్రిటీగా సమంత రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం సమంత శివ నిర్వాణ డైరెక్షన్లో "ఖుషి", సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తుంది. ఇంకా, శాకుంతలం, యశోద సినిమాలు విడుదల కావలసి ఉంది.
లేటెస్ట్ గా సమంత ఒక బిగ్ అండ్ క్రేజీ కోలీవుడ్ ప్రాజెక్ట్ లో భాగం కానున్నట్టు తెలుస్తుంది. విక్రమ్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్ తదుపరి హీరో విజయ్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో సమంత నటిస్తున్నట్టు కోలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఐతే, ఈ న్యూస్ లో ట్విస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు విజయ్ తో కలిసి నటించిన సమంత ఈ సినిమాలో విజయ్ కు యాంటీగా అంటే విలన్గా నటించబోతుందని టాక్. మరి, ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావలసి ఉంది.