పవన్ కళ్యాణ్ పొలిటికల్ పనుల్లో బిజీగా తిరుగుతూ ఉండటంతో అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. వాతావరణం సరిగ్గా లేకపోయినా, వర్షాలు కురుస్తున్నా పవన్ వరుస పర్యటనలు చేశారు. అలా వర్షాల్లో తడవడం వల్ల బాగా జ్వరం వచ్చినట్లు, వెన్ను నొప్పి కూడా అధికమైనట్లు చెబుతున్నారు. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.