సినీ నిర్మాత శేఖర్‌రాజుపై రామ్‌గోపాల్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘లడ్కీ’ సినిమాను నిలుపుదల చేశారంటూ పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్జీవీ తనకు నగదు ఇవ్వాలని లడ్కీ చిత్రంపై శేఖర్‌రాజు సివిల్ కోర్టులో కేసు వేశారు. కోర్టు నుండి సినిమా విడుదల ఆపాలని ఈరోజు ఆర్జీవీకి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆర్జీవీ నిర్మాతకు తాను నగదు ఇవ్వాల్సిందేమీ లేదని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.