మోసగాళ్లు చిత్రం తర్వాత మంచు విష్ణు నుండి మరో కొత్త సినిమా రాబోతుంది. అదే ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న "జిన్నా". ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు పాత్రలో విష్ణు నటిస్తున్నాడు. ఇందులో విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
AVA ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ నుండి ఒక ఆసక్తికర ప్రకటన జరిగింది. ఈ సినిమాలో ఉండబోయే ఫ్రెండ్ షిప్ సాంగ్ ఈ ఆదివారం అంటే జూలై 24 న ఉదయం 11:13 గంటలకు రిలీజ్ చెయ్యనున్నట్టు కొంచెంసేపటి క్రితమే అధికారిక ప్రకటన జరిగింది. ఐతే, ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా... ఉంది... అదేంటంటే, ఈ పాటతో మంచు మోహన్ బాబు మనవరాళ్ళు, విష్ణు కూతుళ్లు అరియనా, వివియానా టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో ఈ పాట మేజర్ హై లైట్ కానుందని వినికిడి. దీంతో మంచు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa