ప్రముఖ గాయకుడు బాబా సెహగల్ తెలుగు మూవీల్లో పాటలు పాడి ఇక్కడ కూడా పాపులార్టీ సంపాదించుకున్నాడు.. ప్రభాస్, అల్లు అర్జున్, పవన్, చిరంజీవి, రవితేజ కోసం పాటలు పాడిన సెహగల్ తాజాగా మహేష్ కోసం పాట పాడాలని ఉందని తన మనసులోని కోరికను బయట పెట్టాడు.. తాజాగా అతడు ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలను వివరించాడు. పవన్ కళ్యాణ్ . ‘జల్సా’ సినిమాలో టైటిల్ సాంగ్ తనకు మంచి ఫేమ్ తీసుకొచ్చిందని చెప్పాడు. తనకు టాలీవుడ్ అంటే చాలా ఇష్టమని వ్యాఖ్యానించాడు. తనకు తెలుగు అంతగా రాదనీ, ఎక్కడైనా మాట్లాడాలన్నా, ఈవెంట్స్ లో పాల్గొనాలి అనుకున్నా, చెప్పాల్సిన విషయాన్ని ఓ కాగితంపై రాసుకుని వెళతానని తెలిపాడు.
టాలీవుడ్ లో హీరోల పేర్లు తనకు చాలా ఇష్టమన్నాడు. పవన్ కల్యాణ్ పాటలు ఎక్కువగా పాడడం కారణంగానే తనకు పవర్ సింగర్ అనే పేరు వచ్చిందని సెహగల్ చెప్పుకొచ్చాడు. ప్రభాస్, అల్లు అర్జున్, పవన్, చిరంజీవి, రవితేజ కోసం పాటలు పాడాననీ, మహేశ్ బాబుకు మాత్రం ఇంతవరకూ పాట పాడలేదని వెల్లడించాడు. ‘మహేష్ గారూ, నాకు మీ సినిమాలో ఓ అవకాశం ఇవ్వండి’ అని నవ్వుతూ సెహగల్ కోరాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa