అక్కినేని నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంల "థాంక్యూ" సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోంది. స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమా జూలై 22న భారీగా విడుదల కానుంది. థ్యాంక్యూ మూవీ టీమ్ ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ నగరాల్లో ఈ రాత్రికి ప్రత్యేక ప్రీమియర్ షోలను ఏర్పాటు చేసింది. వైజాగ్, విజయవాడ, భీమవరం, రాజమండ్రి మరియు నెల్లూరులో ఈ స్పెషల్ షో ప్రీమియర్ షోను ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. ఈరోజు రాత్రి 09:30 గంటలకు స్పెషల్ షోలు ప్రారంభం కానున్నాయి. ఈ సినిమాలో అవికా గోర్, మాళవిక నాయర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "థ్యాంక్యూ" చిత్రాన్ని దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.